28 August, 2026 | 11:35 PM

ప్రభుత్వ ఐటిఐ (బాలికలు) 3వ విడత వాక్ఇన్ అడ్మిషన్లు

28-08-2026 10:35 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ కొండాపూర్ లోని ప్రభుత్వ ఐటిఐ  (బాలికలు) వివిధ ట్రేడ్లలో అడ్మిషన్లు మూడో విడత జరుగుతున్నవి.చెరు ఎలక్ట్రిషియన్ (2సంవత్సరాలు), ఎలక్ట్రానిక్ మెకానిక్ (2 సంవత్సరాలు), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ (1 సంవత్సరం), ప్యాషన్ డిజైన్ టెక్నాలజీ (1 సంవత్సరం), కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ (1 సంవత్సరం), సీట్ల భర్తీకి (బాలికలు) సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఆన్ లైన్ లో www.iti.Telangana.Got.in వెబ్ సైట్ లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ వై. నరేందర్ తెలిపారు.

అనంతరం ఆగస్టు 29వ తేదీ నుండి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం ఒకటి గంట లోపు ఐటిఐ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్ తో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ కోసం ఎస్ ఎస్ సి మెమో, ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు 3, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. అర్హత కలిగిన (బాలికలు) విద్యార్థినీలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన ట్రేడ్ లో అడ్మిషన్ పొందాలని కోరారు. వివరాలకు 9941362193, 9949920157 సెల్ నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.