26-11-2025 01:58:14 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని మూసి రోడ్ ఎస్ఎల్బిసి కాలువ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయం నకిరేకల్ మండల మినీ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఓనర్స్ & డ్రైవర్స్ యూనియన్ (CITU అనుబంధం)ఆఫీసును బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి శుభాకాంక్షలుతెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ చెవుగోని రజిత శ్రీనివాస్, కట్టంగూర్ మాజీ జడ్పిటీసీ మాదయాదగిరి, స్థానిక కౌన్సిలర్ రాచకొండ సునీల్, నాయకులు ఫన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, మంగినపల్లి రాజు, గాదగోని కొండయ్య, ఆ ట్రాన్స్ పోర్టు గౌరవాధ్యక్షులు: అక్కినపల్లి శ్రీను,అధ్యక్షుడు: పొడిచేటి రాంబాబు,ఉపాధ్యక్షుడు: అక్కినపల్లిసైదులు,కార్యదర్శి: నరావుల మల్లేష్,సభ్యులు జె. అనిల్ కుమార్, శశి కుమార్, జి. ప్రవీణ్ కుమార్, శ్రీను, యాదయ్య, వీరయ్య, సుధాకర్, చంద్రశేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.