calender_icon.png 4 February, 2026 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలకు బహుమతులు అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్

04-02-2026 02:16:11 AM

ధర్మపురి,ఫిబ్రవరి3(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం స్తంభం పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీలో గెలుపొందిన విజేతలకు మంగళవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మేరుగు మురళి గౌడ్, గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.