25 June, 2026 | 4:58 PM

వీధి కుక్కల దాడిలో గొర్లు మృతి

25-06-2026 04:25 PM

పినపాక జూన్ 25(విజయక్రాంతి): పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో వీధి కుక్కలు గొర్ల పై దాడిచేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే... గోపాలరావుపేట గ్రామంలోని  బండగొర్ల సంతోష్ గొర్లమంద పై గురువారం తెల్లవారు జామున అరడజను వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 3 గొర్లు చనిపోగా, 5 గొర్లు గాయాలపాలయ్యాయి. దాదాపు రూ.30 నుంచి 40 వేలు నష్టం జరిగినట్లు సంతోష్ తెలిపాడు.ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.