కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
గ్రామ అభివృద్ధి కోసం పార్టీ లో చేరాం...
బోథ్, జూన్ 25( విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అందుకే తాము బిజెపిని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని పోచ్చెర గ్రామానికి చెందిన బిజెపి నాయకులు చిలుకూరి రమేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బోత్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి అనేది కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మి పార్టీ మార్చడం జరిగింది అన్నారు అయితే పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని ఆత్మ చైర్మన్ పేర్కొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి సహకార సంఘం డైరెక్టర్ చట్ల ఉమేష్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ పసుల చంటి వినయ్ రెడ్డి మహమ్మద్ అరుణ్ రెడ్డి అచ్యుత్ రెడ్డి సుమేందర్ భీమ బుచ్చన్న తదితరులు ఉన్నారు






