15 August, 2026 | 3:29 PM

అన్ని రంగాలలో అగ్రగామిగా కరీంనగర్ జిల్లా

15-08-2026 02:38 PM

నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీక రేషన్ కార్డులు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్, ఆగస్టు 15(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నా మని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల క్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) అన్నారు. 80వ స్వాతంత్ర ది నోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ము ఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వా తంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోం దని,అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం  “సన్న బియ్యం” పంపిణీని చేస్తుందని, నేటి నుండి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు.

రు.13 వేల కోట్ల వ్యయం తో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అంది స్తున్నామన్నారు. ప్రభుత్వం అందించిన కొత్త రేషన్ కార్డులుప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీకగా నిలిచాయన్నారు. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. పదే ళ్ల తర్వాత చేతికి అందిన రేషన్ కార్డుతో... రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోందన్నా రు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడు తున్నా... రైతుల విషయంలో రాజీ పడకుం డా తెలంగాణ రైతు అండగా ఉంటున్నామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తున్నామని. వీరికి ఉపకార వేతనాలు అందించడంతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నామన్నారు. గత విద్యా సంవత్సరం ఈ వసతి గృహాల్లో చదివిన పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఎస్సీ, స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 238 మంది ఉద్యోగాలు సాధించారన్నారు.

బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 17 వేల 996 మంది విద్యార్థులకు 22 కోట్ల 82 లక్షల రూపాయల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందజేశాం. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం అమలుకు 50 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందిని, అదేవిధంగా జిల్లాలోని ఒక వేయి 518 సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కేజీవీబీలు, మోడల్ స్కూల్స్, అంగన్ వాడి కేంద్రాలకు 395 టన్నుల ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని ప్రతి నెలా సరఫరా చేస్తున్నామనిజిల్లాలో 777 అంగన్వాడి కేంద్రాల ద్వారా 7 వేల 579 మంది గర్భిణీలు, బాలింతలకు, 42 వేల 909 మంది 7 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు బలవర్ధక, పోషక ఆహారం అందిస్తున్నామన్నారు జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.

గత నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 151 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించాం. వయో వృద్ధులు, తల్లిదండ్రుల సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులకు ఈ ఏడాది 132 సహాయ ఉపకరణాలు పంపిణి చేశాం. దివ్యాంగులను వివాహం చేసుకున్న 17 జంటలకు ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరిగింది. ట్రాన్స్ జెండర్ల కోసం మైత్రి క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్ల యు.సి.ఎఫ్ నిధులు, 50 కోట్ల రూపాయల యు.ఐ.డి.ఎఫ్ నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టడడం జరిగిందని 158 కోట్ల  మున్సిపల్ సాధారణ నిధులతో నగరంలో సి.సి రోడ్లు, డ్రైన్, మంచినీటి పైప్ లైన్ వంటి పనులు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో జనగణన భాగంగా మొదటి దశలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా సేకరణ ప్రక్రియ పూర్తయింది. వచ్చే ఫిబ్రవరిలో జనగణన చేపట్టనున్నారని తెలిపారు.