ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ
ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రి ఘటనలో డైట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) బుధవారం ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించారు. మానసిక రోగుల అస్వస్థతకు(Erragadda Mental Hospital) గురైన ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ పై మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రి ఘటనలో డైట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కాంట్రాక్టు రద్దుతో పాటు కేసు నమోదు చేస్తామని మంత్రి వెల్లడించారు. మొత్తం 92 మంది రోగులు అస్వస్థత, 18 మందికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఆహారం, నీటి నమూనాల నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగులను మంత్రి దామోదర పరామర్శించారు.






