1 June, 2026 | 5:33 PM

మంత్రి శ్రీధర్ బాబు చొరవ: రూ.1.50 లక్షల ఎల్ఓసి మంజూరు

01-06-2026 04:43 PM

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఐటీ శాఖ మంత్రి

ముత్తారం,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొండంత భరోసానిచ్చారు. మంథని నియోజకవర్గం ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన తోడేటి కొమురయ్య గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితి నిరుపేద కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాల్సిందిగా బాధితుడి కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు ని ఆశ్రయించారు. బాధితుడి పరిస్థితిపై తక్షణమే స్పందించిన మంత్రి  ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 1,50,000/ లక్ష యాభై వేల రూపాయల ను అత్యంత వేగంగా మంజూరు చేయించారు.

క్యాంప్ కార్యాలయంలో చెక్కు అందజేత

మంత్రి  ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి  క్యాంపు కార్యాలయంలో ఆయన ఆస్పత్రి సహాయకులు ఈ ఎల్ ఓసీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. సమయానికి ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబానికి అండగా నిలిచిన పెద్ద దిక్కైన మంత్రి  శ్రీధర్ బాబుకి ఎప్పటికీ రుణపడి ఉంటామని బాధితుడు కొమురయ్య కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.