4 April, 2026 | 9:01 PM

Breaking News

హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్లేస్మెంట్ డ్రైవ్   •   పోమాల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి   •   అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు   •   మరోసారి ఔదార్యం చాటుకున్న తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్   •   గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన హరిప్రియ నాయక్   •   లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం   •   అర్బన్ కాలనీ అంగన్వాడి కేంద్రాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు   •   పేద మధ్యతరగతి ప్రజలపై ధరల భారం పెరుగుతోంది: సిపిఎం   •   పేదల జీవితాలలో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం   •  

చారిత్రాత్మక నాగన్న మెట్ల భావిని సందర్శించిన మంత్రి జూపల్లి

07-12-2024 07:00 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో గల 400 సంవత్సరాల చారిత్రాత్మక నాగన్న మెట్ల భావిని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. 400 సంవత్సరాల చారిత్రాత్మక గల నాగన్న మెట్ల భావిని పునరుద్ధరించిన స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ & రైన్ వాటర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. లింగంపెట్ నాగన్న మెట్ల భావినీ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రభుత్వ సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీ సురేష్ శెట్కర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.