4 April, 2026 | 11:43 PM

ముఖ్యమంత్రిని కలిసిన తూప్రాన్ వైస్ చైర్మన్

07-12-2024 07:06 PM

తూప్రాన్ కు మరిన్ని నిధులు కేటాయించాలని కోరిన వైస్ చైర్మన్

జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఆశీర్వాదాలు తీసుకున్న వైస్ చైర్మన్ శ్రీనివాస్

చేగుంట: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తూప్రాన్ అభివృద్ధికి మరిన్ని నిధుల కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందించారు. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రిని నంద్యాల శ్రీనివాస్ శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కూడా వైస్ చైర్మన్ శ్రీనివాసులును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుచరుడు రాజ్ డిజిటల్ మేడ్చల్ అధినేత కొండారాజు తదితరులు పాల్గొన్నారు.