ఊట్లలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
అయ్యప్ప నామస్మరణతో పులకించిన ఊట్ల గ్రామం
పడిపూజకు హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి
పటాన్ చెరు (విజయక్రాంతి): జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయ రెండవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. మహా పడిపూజకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, పటాన్ చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, జెడ్పి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి కొలను బాల్ రెడ్డి, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, జిల్లా నాయకుడు విక్రమ్ రెడ్డి తదితర నాయకులు అయ్యప్ప పడిపూజకు హాజరయ్యారు. పడిపూజ సందర్భంగా ఊట్ల గ్రామపంచాయతీ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు భారీగా హాజరయ్యారు. పడి పూజను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో అయ్యప్ప ఆలయ ఆవరణ కిక్కిరిసిపోయింది. నర్సింగరావు, కపిల్ భజన బృందాలు అందరిని ఆకట్టుకొని ఉర్రూతలూగించాయి. అయ్యప్ప స్వాములు కళాశాలతో 18 మెట్లు పైకి ఎక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేశారు. అయ్యప్ప నామస్మరణ, శరణు ఘోషతో ఊట్ల గ్రామం పులకించింది.




