calender_icon.png 12 November, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావుపై కేసు నమోదు

03-12-2024 12:19:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుపై మంగళవారం కేసు నమోదైంది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావుపై 120(బీ), 386, 409, 506, రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు అప్పటి టాస్క్  ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావును కూడా చేర్చడం గమనార్హం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. బీఆర్ఎస్ ప్రబుత్వంలో టాస్క్ ఫోర్స్ లో పని చేసిన పలువురు పోలీసులు అధికారులును అరెస్టు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్యను ఈ కేసులో పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.