calender_icon.png 21 January, 2026 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూపల్లి సార్.. ద గ్రేట్

21-01-2026 12:00:00 AM

నాలుగు జిల్లాల్లో పర్యటించి కలెక్టరేట్లో బస

రెండోసారి కలెక్టరేట్లో నిద్రించిన మంత్రి జూపల్లి

నిర్మల్, జనవరి 20 (విజయక్రాంతి): ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ప్రస్తుత ప్రజాపాల ప్రభుత్వ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆరుప దుల వయసు మించిన ఆత్మవిశ్వాసంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో రెండవసారి బస చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. రాష్ట్ర మంత్రి హోదాలో కలెక్టర్ కార్యాలయంలో బసచేయడంపై జిల్లాలో చర్చ జరుగుతుంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ఆసిఫాబాద్ అదిలాబాద్ నిర్మల్ నాలుగు జిల్లాలను సోమవారం పర్యటించిన మంత్రి జూపల్లి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు నాగోబాను దర్శించుకున్న మంత్రి రాత్రి 11 గంటలకు నిర్మల్ చేరుకొని నిర్మల్ ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లాల్సిన మంత్రి కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఇక్కడే బస చేయ నున్నట్టు అధికారులకు చెప్పడంతో వారు అప్పటికప్పుడు అక్కడ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి రెండుసార్లు కలెక్టర్ కార్యాలయంలో బస చేసి తన రాజకీయ ముద్రను చాటుకున్నారు మంగళవారం ఉదయం తిరిగి ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు