21-01-2026 12:00:00 AM
మంత్రి వివేక్ వెంకట స్వామి
చెన్నూర్, జనవరి 20 : మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. మంగళ వారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు చీరలను డీఆర్డీఓ కిషన్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంకా ఎక్కువ కష్టపడి ఉన్నతి సాధించాలని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభు త్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు. చెన్నూర్ లో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చెన్నూర్ మున్సిపాలిటీ (మెప్మా)లో మహిళలు ఎక్కువ సంఖ్యలో చేరి ప్రభుత్వ ఫతకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారు లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.