డా.పైడి ఎల్లారెడ్డికి ప్రతిష్టాత్మక జపాన్ పర్యటనకు ఆహ్వానం
తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవం!
కామారెడ్డి, ఆగస్టు 9 (విజయక్రాంతి): ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి చెందిన డా. పైడి ఎల్లారెడ్డి కి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవకాశం లభించింది. గ్రామీణ మూలాలను మరిచిపోకుండా నిరంతరం సమాజ హితం కోసం, సైన్స్, రాజకీయ రంగాలలో విశేషమైన సేవలందిస్తున్న ఆయన... మరోసారి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఆగస్ట్ 24 నుంచి 28 వరకు జపాన్ దేశంలో పర్యటించనున్న ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ డెలిగేషన్ (వ్యాపార ప్రతినిధి బృందం)లో ఆయనకు చోటు దక్కడం తెలంగాణ వాసి కి గర్వించదగ్గ విషయం. భారత పరిశ్రమల సమాఖ్య డాక్టర్ ఐ డి ఎల్లారెడ్డి కి అధికారికంగా సమాచారం అందజేశారు.
అధికారిక భాగస్వామ్యం
భారత ప్రభుత్వం, జపాన్లోని భారత రాయబార కార్యాలయం, పలు ప్రముఖ జపాన్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక పర్యటన , సమావేశాలు జరగనున్నాయి. ఈ పర్యటన లో భాగంగా హైలెవెల్ బిజినెస్ మీటింగ్స్ నిర్వహించ డంతోపాటు, జపాన్లోని పలు అగ్రగామి కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరుపుతారు.
తెలంగాణకు గర్వకారణం..!
తెలంగాణ గడ్డపై పుట్టి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిగా ఎదుగుతూ నేడు అంతర్జాతీయ వేదిక పై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డా.పైడి ఎల్లారెడ్డి ప్రయాణం ఎంతో మంది యువతకు ఆదర్శ ప్రాయం. ఈ ప్రతిష్టాత్మక జపాన్ పర్యటన విజ యవంతం కావాలని, తద్వారా రాష్ట్ర, దేశ ఖ్యాతి మరింత ఇనుమడించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.






