10 August, 2026 | 2:49 AM

ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం

19-06-2024 07:04 PM

హైదరాబాద్ : జూన్ 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణమాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో రుణమాఫీ సుమారు రూ.30 వేల కోట్లు, రైతు బరోసాకు రూ.7 వేల కోట్లు అవసరమవడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర కొత్త చిహ్నంపై కేబినెట్ లో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.