29 July, 2026 | 9:57 PM

Breaking News

బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •  

షాహినాయత్‌గంజ్ ఘటనపై మంత్రి కొండా సురేఖ సీరియస్‌

12-02-2025 05:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): షాహినాయత్‌గంజ్‌లోని ప్రార్థనా స్థలంపై మంగళవారం రాత్రి మాంసం ముక్కలు విసిరిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి, పరిశీలించారు. వివరణాత్మక నివేదికను త్వరగా సమర్పించాలని శాఖ సీనియర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కొండా సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర దర్యాప్తు తర్వాత ఈ సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించడానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. తమ తప్పులతో ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదన్నారు. పోలీసు శాఖ వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.