29 July, 2026 | 10:05 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా   •   గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •  

తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్

29-07-2026 09:27 PM

చిట్యాల,(విజయ క్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తెలంగాణ జలసిరి కార్యక్రమంపై గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జలసిరి పథకం కింద వీబీజీ రాంజీ ద్వారా ఉపాధి కల్పిస్తూ గ్రామసభ ఆమోదంతో పనులను గుర్తించి రైతులు వాటిని చేపట్టవచ్చని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు, పంట గుంటలు, బోర్ గుంటల నిర్మాణం వంటి నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

నీటి మట్టం తగ్గిన బోర్ల చుట్టూ కందకం తవ్వి, అడుగుభాగంలో పెద్ద రాళ్లు, వాటిపై చిన్న రాళ్లు, అనంతరం ఇసుక పొర వేసి వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చేస్తే ఎండిపోయిన బోర్లలో కూడా నీరు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర భవనాల పైకప్పుల నుంచి వచ్చే వర్షపు నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించడం ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఇంటిలో ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో సహకరిస్తారని హామీ ఇచ్చారు.