29 July, 2026 | 10:08 PM

Breaking News

మద్యం మత్తులో అతివేగంగా వచ్చి వ్యక్తిని ఢీకొట్టిన కారు వ్యక్తి వృత్తి   •   అదుపుతప్పి కారు బోల్తా   •   గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •  

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

29-07-2026 09:35 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ తల్లి ఇనుముల గౌరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా గౌరమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన శ్రీను బాబు, ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని గౌరమ్మకు నివాళులర్పించారు.