సిఐ నీలం రవికి ఘన సన్మానం
29-07-2026 09:40 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (సిఐ)గా బాధ్యతలు స్వీకరించిన నీలం రవిని మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్‌లు కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సిఐ నీలం రవికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్, బీఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బీన్ అబ్దుల్లా, పార్టీ నాయకులు సయ్యద్ నిసార్, దూడల అశోక్, షేక్ సమద్, సాయి శ్రవణ్, ఫహద్ తదితరులు పాల్గొన్నారు.






