30-10-2025 12:54:12 PM
కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం.
నేలకొరిగిన వరి పంట.
గ్రామాలలో కూలీన ఇండ్లు. పొంగిపొర్లుతున్న వాగులు.
హుజురాబాద్,(విజయక్రాంతి): మొంథా తుఫాను కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ డివిజన్లో మంగళవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకుకురిసిన వర్షాలకు అపార నష్టం కలిగించింది. రైతులు వర్షాలకుదిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. హుజురాబాద్ డివిజన్లో(Huzurabad division) హుజురాబాద్ తో పాటు జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కేశపట్నం, సైదాపూర్ మండలాల్లోవాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పొలాలు పూర్తిగా నెలకొరుగాయి, పత్తి చేలలో పత్తి చేతికి రావడంతో చేలలోనే పత్తి తడిసి ముద్దయింది. కేశపట్నం మండలం లో అన్ని గ్రామాల్లో వరి పంటలు నేలకొరగాయి తడికల్ సహకార సంఘంలో ఐకెపి సెంటర్లో అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం తడిసి ముద్దాయి నీళ్ల పాలైంది అరగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.
సైదాపూర్ మండలంలో సోమవారం ఆదర్శ పాఠశాల భారీ వరద ప్రవాహంతో జల మయమైంది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చిలుక వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని 19 వ వార్డులో గోస్కుల కిరణ్ సంబంధించిన ఇల్లు నెల మట్టమయింది. మండలంలోని ధర్మరాజు పల్లి గ్రామంలో లక్ష్మి సంబంధించిన ఇల్లు కూలిపోయింది. హుజురాబాద్ మండలంలోని 12 గ్రామాలలో 100 మంది రైతులు వేసిన 105 ఎకరాల పత్తి నష్టం జరిగింది. 2700 మంది రైతులు సాగు చేసిన 3959 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. సైదాపూర్ మండలంలోని 12 గ్రామాలలో 296 మంది రైతులకు 324 ఎకరాల మేర పత్తి, 3850 మంది రైతులు4123 ఎకరాల మేర వరి, ఇల్లందకుంట మండలంలో 10 గ్రామాలు ఉండగా 600 మంది రైతులు 300 ఎకరాల్లో పత్తి పంట, 1800 మంది రైతులు 1200 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. జమ్మికుంట మండలంలో 9 గ్రామాలలో 160 మంది రైతులు సాగుచేసిన 200 ఎకరాల పత్తి పంటకు, 900 మంది రైతులు సాగుచేసిన 1400 ఎకరాల వరి పంటకు నష్టం కలిగింది. వీణవంక మండలంలోని 14 గ్రామాల్లో 275 మంది రైతులు సాగుచేసిన 220 ఎకరాల పత్తి, 1800 మంది రైతులు సాగుచేసిన 1650 ఎకరాల వరి పంటకు తీవ్ర నష్టం కలిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.