calender_icon.png 30 October, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్

30-10-2025 12:49:29 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddyవరంగల్‌, హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో మంత్రులుతుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ, వాకటి శ్రీహరి, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని కలెక్టర్లు సీఎంకు వివరించారు. పంట నష్టాలు, రహదారుల నష్టాల గురించి అధికారుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించారు.

పంటల కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పంటనష్టం, రోడ్ల నష్టంపై సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వరద సాయం పొందే అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు. వరంగల్ పరిధిలోని ఎన్‌ఎన్ నగర్, బీఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మంత్రి కొండా సురేఖ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వరద ముంపు ప్రాంత బాధితులను పరామర్శించి, కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారికి భరోసా కల్పించారు.