14-01-2026 12:00:00 AM
ములకలపల్లి,జనవరి 13 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సర్పంచులుగా గెలిచిన వారిని అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సన్మానించారు.ములకలపల్లి సర్పంచ్ కొర్సా చంద్రలేఖ, జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్, ఉప సర్పంచ్ జలగం మాధవి, పొగళ్లపల్లి సర్పంచ్ మడకం రవి, సీతాయిగూడెం సర్పంచ్ కారం చంద్రకళ, ఉప సర్పంచ్ లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖ మ్మం ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, పార్టీ కండువాలతో సన్మానించి నూతన వస్త్రాలు బహుకరించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు, నాయకులు గాడి తిరుపతిరెడ్డి, సురభి రాజేష్, శనగపాటి రవి,ఈర్ల మహేశ్వరావు జలగం రవి, పాలకుర్తి సుమిత్, ముదిగొండ శివ తదితరులు పాల్గొన్నారు.