14-01-2026 12:00:00 AM
కొత్తగూడెం, జనవరి 13 (విజయక్రాంతి): ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తముగా నిర్వహించే జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల కార్యక్రమం లో భాగ ముగా, మంగళవారము నాడు సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు జాతీయ రహదారి భద్రతా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏసిఎంఓ ఎం.ఉష హాజరై, సింగరేణి ప్రధాన ఆసుపత్రిలోని ఉద్యోగులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భముగా ఏసిఎంఓ ఎం.ఉష మాట్లాడుతూ, ఉద్యోగులందరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన కలిగిఉండాలనే ఉద్దేశం తో చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీ డాక్టర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్, ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సంధర్భముగా రహదారులపై ప్రయాణించే మరియు డ్రైవింగ్ చేసే సమయం లో తీసుకొనవలసిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించు కుంటున్నామని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారులో ప్రయాణిం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని, మద్యం సేవించి అస్స లు వాహనం నడపకూడదు అని, డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు అని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని మీ భద్రతే మీ కుటుంబ భద్రత అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏసిఎంఓ ఎం.ఉష, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీమతి డి. లలిత, వెల్ఫేర్ ఆఫీసర్ ఎండి.ఖలీల్ అహ్మద్, సూపరింటెండెంట్ లు, డాక్టర్లు, మరియు మెయిన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.