13-01-2026 11:47:45 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ లతో కలిసి జిల్లా సాయి దివ్యంగుల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం వారి హక్కుల పరిరక్షణ కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
దివ్యాంగుల హక్కుల చట్టం 2016, తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల హక్కుల నియమాలు 2018 ప్రకారం జిల్లాలో అమలు అవుతున్న పథకాలు, దివ్యాంగులకు సంబంధించిన విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల చిత్రాలపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.