calender_icon.png 20 August, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక పరిస్థితి సరిగాలేకున్నా.. హామీలు అమలు చేస్తున్నాం

20-08-2025 01:16:29 PM

హైదరాబాద్: గచ్చిబౌలిలోని టీఏఎల్ఐఎంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల(Integrated Registration Office) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి(Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా.. ఎన్నికల హామలను అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని వెల్లడించారు. 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి 62 శాతం ఆదాయం వస్తుందని మంత్రి వివరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇబ్బందులు ఉండకూడదనే అన్ని సదుపాయాలతో ఆఫీసులు నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.