calender_icon.png 20 August, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 13 మంది ఎస్సైలు బదిలీలు

20-08-2025 01:10:47 PM

హన్మకొండ (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate) పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 13 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్ లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(CP Sunpreet Singh) ఉత్తర్వులు జారీ చేశారు. యస్.వెంకన్న వి ఆర్ నుంచి తరిగొప్పుల పోలీస్ స్టేషన్ కు, జి.శ్రీదేవి తరిగొప్పుల నుండి వి ఆర్ కు, ఎం.రాజు గీసుకొండ నుండి ముల్కనుర్ కు, జి.అనిల్ కుమార్, టి. విజయ రాజ్ వి ఆర్ నుండి గీసుకొండ స్టేషన్ కు, ఎన్.సాయి బాబు ముల్కనుర్ నుండి వర్ధన్నపేటకు, బి.చందర్ వర్ధన్నపేట నుండి టాస్క్ ఫోర్స్ కు, ఎం.కుమార స్వామి వి ఆర్ నుండి వరంగల్ ట్రాఫిక్ కు, బి. విజయ్ కుమార్ వి ఆర్ నుండి హన్మకొండ ట్రాఫిక్ కు, ఇ.రతిష్, ఆనంద్ లు వి ఆర్ నుండి సి ఎస్ బికి, టి.యాదగిరి వరంగల్ ట్రాఫిక్ నుండి సిసి యస్ వరంగల్, ఇ.నారాయణ హన్మకొండ ట్రాఫిక్ నుండి వి ఆర్ కు అటాచ్ చేసినట్లు వరంగల్ కమిషనర్ సంప్రీత్ సింగ్ తెలిపారు.