14 July, 2026 | 10:07 AM

కొందరు రైతుల ముసుగు వేసుకున్నారు: మంత్రి పొంగులేటి

13-11-2024 12:23 PM

హైదరాబాద్‌: రైతులను అడ్డం పెట్టుకొని ముసుగు వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు పడాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మరికొద్దిసేపట్లో ముసుగు వేసుకున్న వాళ్లను మీడియా ముందు ప్రవేశ పెడతామని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలు విని పరిస్కార మార్గం కనుగొనడానికి గాంధీ భవన్‌కు వచ్చినట్లు మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతో ఇబ్బంది పడ్డ బాధితులు ఎక్కువగా గాంధీభవన్ కు వస్తున్నారని, వాళ్ల సమస్యలు పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.