భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి
వరంగల్, ఆగస్టు 10 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి ఆలయాన్ని సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి వెంట వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎం.ఎల్.సి బస్వరాజు సారయ్య, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారదా దేవి, చాహత్ బాజ్పాయ్ తదితరులున్నారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈ.ఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు ఘనస్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యవమున అర్ధకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.






