calender_icon.png 11 February, 2026 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

11-02-2026 04:04:22 PM

హైదరాబాద్: హుస్నాబాద్ నవ భారత్  హైస్కూల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ లో ఓటు అనేది ఆయుధం అని, పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారని, అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో, అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.