22 June, 2026 | 2:06 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •  

పురపోరులో 75 శాతం కాంగ్రెస్ వశం

11-02-2026 04:30 PM

హైదరాబాద్: కొల్లాపూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... రాష్ట్రంలో 75 శాతం మున్సిపాలిటీలను ప్రజా ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.  గత పాలకుల అవినీతికి కొల్లాపూర్ మున్సిపాలిటీలోని ప్రజలు తమ ఓటింగ్ తో బుద్ధి చెప్పబోతున్నారని మంత్రి తెలిపారు. 19వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తంచేశారు.