మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్ఐఆర్ పై దుష్ప్రచారం మానుకోవాలి
ముకరంపుర, జూన్ 25(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ పై రాష్ట్ర మంత్రికె విశ్వాసం లేకపోతే ఎలా అని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో తన కుటుంబ సభ్యుల యొక్క ఎస్ఐఆర్ ఫారం లు నింపి అధికారులకు తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్ఐఆర్ వల్ల ఓట్లు పోతాయని ఇటీవల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఎస్ ఐ ఆర్ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటే కేవలం బంగ్లాదేశీ రోహింగ్యాల ఓట్లు కాపాడటం కోసం కోసం పొన్నం ప్రభాకర్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేరళలో డూప్లికేట్ ఓట్లు తగ్గిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగిందని శశి థరూర్ పేర్కొన్నారని, సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన పిటిషన్లు కొట్టి వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో చొప్పదండి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్ కుమార్, గుండె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు






