సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
మేడారం, జనవరి 14 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ఈనెల 19న ప్రారంభించడానికి ఈనెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శతక అధికారులతో కలిసి పరిశీలించారు. గద్దెల ప్రాంగణం ల్యాండ్ స్కేప్ పనులను, క్యూలైన్ పనులను మంత్రి పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను చేపట్టాలన్నారు. గద్దెల ప్రాంగణంలో వివిధ రకాల ఔషధ మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు.
భూములు ఇచ్చిన రైతులకు ఇండ్ల పట్టాలు పంపిణీ
మేడారం జాతర నిర్వహణ కోసం భూములను ఇచ్చిన రైతులకు బుధవారం మేడారంలో ఇళ్ల స్థలాల పట్టాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర నిర్వహణ కోసం భూసేకరణ పారదర్శకంగా నిర్వహించామని, భూములు ఇచ్చిన రైతులకు కృత జ్ఞతలు తెలిపారు. మేడారంలో భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ములుగు సమీపంలోని ఇంచర్ల ప్రాం తంలో జాతీయ రహదారి వద్ద ఇండ్ల స్థలాలు కేటాయించినట్లు చెప్పారు. అలాగే మేడారం జా తర సందర్భంగా షాపులను కేటాయించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, ఆర్డిఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.




