15-01-2026 12:34:42 AM
అలంపూర్, జనవరి 14: జూనియర్ డాక్టర్ లావణ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం జల్లాపురం గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక గౌరవమైన వృత్తిలో ప్రణయ్ తేజ ఉంటూ ప్రేమ పేరుతో మోసం చేసి ఆపై మానసికంగా వేధించడంతో లావణ్య ఆత్మహత్యకు పాల్పడిందని వెంటనే అతని మెడికల్ రీక్నజ్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.