మంత్రి సీతక్క లీగల్ నోటీసు X సీబీఐ విచారణకు లేఖ రాయండి
సీతక్క x బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలుచేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీ సేలా బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసు పంపించారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్డ్ పో స్టు ద్వారా ఈ నోటీసు పంపించారు.
నోటీసులో అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(టీజీటీఎస్) నిర్వహించిందని, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ కేటాయించారని.. ఇందు లో తన ప్రమేయం లేదని మంత్రి స్పష్టంచేశారు. అయినప్పటికీ తన ప్రతిష్టను దెబ్బతీ సేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం టెండర్ విలువ రూ. 44.42 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసంబద్ధమని, ఇది పూర్తిగా నిరాధార ఆరోపణ అని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని, ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగో లుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ సూచనల మేరకే టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఈ మేరకు 48 గంటల్లో సోషల్ మీడియా పోస్టులను తొలగించి, బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసు కుంటామని లీగల్ నోటీసులో హెచ్చరించారు. అనంతరం ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క.. అంగన్వాడీ మొబైల్ కొనుగోలు విషయంలో బీఆర్‌ఎస్ పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు.
వ్యక్తిగతంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే పట్టించు కోవాల్సిన అవసరం లేదని, కానీ అవాస్తవాలను పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం వల్లే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు తాను కేసీఆర్‌కు లీగల్ నోటీసు పంపించినట్టు గుర్తుచేశారు.
తప్పును పదిసార్లు చెబితే నిజం కాదని, రూ. 44 కోట్ల టెండర్‌లో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడినప్పుడు తాను గట్టిగా సమాధానం ఇచ్చిన తరువాత తనపై దుష్ప్రచారం ప్రారంభమైందని మంత్రి సీతక్క గుర్తుచేశారు.
- బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): అంగన్వాడీ వర్కర్ల కోసం రూ. 54 కోట్లతో 35,310 ఫోన్లను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలి చి అందులో కేవలం రూ. 24 కోట్ల మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన రూ.30 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుం డా.. మంత్రి సీతక్క చెప్పుతో కొడతామంటే ఎలా అని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో కేసీఆర్‌కు ఏం సంబంధం ఉందని సీతక్క లీగల్ నోటీసులు పంపించా రో సమాధానం చెప్పాలన్నారు.
మేం తప్పు డు ఆరోపణలు చేస్తే సీబీఐ విచారణ చేయాలని లేఖ రాయొచ్చు కదా అని సవాల్ చేశా రు. సోమవారం తెలంగాణ భవన్‌లో క్రిశాం క్ మాట్లాడారు. మంత్రి సీతక్క అంటే బీఆర్‌ఎస్‌కు గౌరవం ఉందని, మా నాయకుడు కేసీఆర్ తమకు సంస్కారం నేర్పించారని స్పష్టంచేశారు. 35,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని మేం కొన్ని రోజు లుగా తెలియజేస్తున్నామని, అంగన్వాడీ వర్కర్స్‌కు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ, తక్కువ ధరకు మొబై ల్ కొనుగోలు చేసి ఇచ్చారని ఆరోపించారు.
ధరలు పెరగడంతో కాంట్రాక్ట్ నుంచి సామ్ సంగ్ మొబైల్ సంస్థ ఎగ్జిట్ అయిందని అం టున్నారని తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీతక్క లేఖ రాశారని ఎద్దేవాచేశారు. సల్మాన్‌ఖాన్ పక్కన, మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి ఈ కాంట్రాక్ట్ వేరే వాళ్లకి ఇప్పించాడని మాకు అనుమానం ఉందన్నారు. మా నాయకులపై కేసులు పెట్టి విచారణకు పిలిస్తే విచారణకు హాజరయ్యారని గుర్తుచేశారు.
మక్కన్ సింగ్‌రాజ్‌ఠాకూర్ సోషల్ మీడియా లో అంగన్వాడీ వర్కర్స్‌కు 5జీ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారని, ఎమ్మెల్యే మేఘా రెడ్డి సైతం తన సోషల్ మీడియాలో అంగన్వాడీ వర్కర్స్‌కు 5జీ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారని, దీనికి ఏం సమాధానం చెప్పా లని క్రిశాంక్ ప్రశ్నించారు. 4జీ ఫోన్లు ఇస్తూ, 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. సీతక్క చెప్పుతో కొడితే పడుతామని, కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు.
అంగన్వాడీ వర్క ర్స్ కోసం ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్ట్ నాకు సంబంధమే లేదని సీతక్క మాట్లాడి, ఇప్పు డు చెప్పుతో కొడుతా అని అనడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నందున తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. డొక్కు ఫోన్లు పట్టు కొని ఇంటింటికి పోతే అనేక సమస్యలు వచ్చి అంగన్వాడీలు ఇబ్బందులుపడుతారని చెప్పారు. ఇది కుంభకోణాల ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే మాకు నమ్మ కం ఉండదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిజాలు చెప్పకుండా చెప్పుతో కొడతామని మాట్లాడిన సీతక్క వ్యాఖ్యలను ఖండించారు. పక్క రాష్ట్రాల్లో 5జీ ఫోన్లు ఇస్తుంటే, తెలంగాణలో 4జీ ఫోన్ ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నా రు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేశారని, కానీ ఆ ప్రాజెక్టుతో ఇప్పటికీ వేల ఎకరాల పంటలు పండుతున్నాయని తెలిపారు.
ధన దాహంతో ములు గులో నలుగురిని పొట్టన పెట్టుకున్న విష యం మర్చిపోయారా అని గుర్తుచేశారు. మేడారం జాతర టెండర్ కోసం ఇద్దరు మం త్రులు కొట్టుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో విచారణ చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవా ల్‌చేశారు. దినేష్ చౌదరి మాట్లాడుతూ.. తక్కువ ధరకు ఫోన్ దొరుకుతుంటే, ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ చేయిస్తామంటున్నారని, మరి స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఎందుకు విచారణ చేయిస్తామనడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు మిలాఖాత్ అయి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని విమర్శించా రు. సీతక్కకు నిజాయితీ ఉంటే స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలన్నారు.






