13 June, 2026 | 5:00 PM

'వీబీజీ రామ్-జీ' పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం

13-06-2026 03:56 PM

హైదరాబాద్: 'వీబీజీ రామ్-జీ' పథకంపై నిరసన తెలపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి వీబీజీ రామ్-జీ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకంపై నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు మంత్రి సీతక్క(Minister Seethakka) వెల్లడించారు. లేఖలో పొందుపర్చాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క చర్చించారు. 60 శాతం నిధులు కేంద్రం నుంచి రావాలంటే కొత్త చట్టం అమలు తప్పదని అధికారులు పేర్కొన్నారు. కేబినెట్ లో చర్చించి పథకం అమలుపై నిర్ణయం తీసుకుంటామని సీతక్క తెలిపారు. వీబీజీ రామ్ జీ(VB G RAM G scheme) అమలు చేయాల్సివస్తే.. కూలీలకు నష్టం లేకుండా చూడాలని సీతక్క కోరారు.