13 April, 2026 | 10:06 AM

ఎర్రవల్లికి వెళ్లనున్న మంత్రి సీతక్క

08-01-2026 12:03 PM

హైదరాబాద్: మంత్రి సీతక్క గురువారం ఎర్రవల్లికి వెళ్లనున్నారు. అక్కడ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఆహ్వానించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం(Medaram) సమ్మక్క–సారలమ్మ మహా జాతరను జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మహా జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క స్వయంగా పరిశీలిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటించనున్నారు.