18 July, 2026 | 1:56 PM

ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో జాప్యం.. రైతుల ఆవేదన

18-07-2026 01:56 PM

కోదాడ జూలై 18,(విజయక్రాంతి): కోదాడ,చింతలపాలెం మండలంలో కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మరమ్మతు చేయడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు బండ లక్ష్మీనారాయణ, కందుల వెంకట్ రెడ్డి, రావూరి సైదా తో పాటు పలువురు రైతులు ఆరోపించారు. కాలిన ట్రాన్స్‌ఫార్మర్లను కార్యాలయానికి తరలించినప్పటికీ రెండు, మూడు రోజుల పాటు మరమ్మతులు చేపట్టడం లేదని వాపోయారు.

దీంతో ఇటీవల నాట్లు వేసిన వరి పొలాలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు సరిగా కురవని పరిస్థితిలో విద్యుత్ మోటార్లపైనే ఆధారపడాల్సి వస్తోందని, ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయకపోవడంతో సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతోందని తెలిపారు. అధికారులు స్పందించి కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు.