calender_icon.png 24 December, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

24-12-2025 06:41:00 PM

నూతన సర్పంచులకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

కాటారం,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాదేవపూర్, పలిమల, మహా ముత్తారం, మలహర్ మండలాల నూతన సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఐదు మండలాలలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను శాలువాతో ఘనంగా మంత్రి సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగం, సేవా నిరతి, అంకితభావం, దీక్ష దక్షతలతో పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికలలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారినీ ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని ఘాటుగా హెచ్చరించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు తమ పరిధికి లోబడి హామీలు ఇచ్చిన మేరకు పరిష్కరించాల్సిన దిశగా ప్రభుత్వంతో సంబంధాలు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉందని వివరించారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటా రాజబాబు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మహాదేవపూర్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మంథని నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, పిసిసి మహిళా సెల్ ఉపాధ్యక్షురాలు ఆంగోతు సుగుణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఓన్న వంశవర్ధన్ రావు, కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం, మలహర్, పలిమల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.