calender_icon.png 24 December, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు

24-12-2025 06:36:04 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణం లక్ష్మీనగర్ శ్రీ చైతన్య పాఠశాలలో బుధ వారం ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అయూబ్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అందరికి సంప్రదాయం, క్రిస్మస్ పండుగ గురించి అవగాహన కల్పించేందుకే ఈ వేడుకలను నిర్వహించామన్నారు. పిల్లలు శాంటా, దేవదూతల వేషాధారణతో అలరించారు. పాఠశాల ఆవరణ అంతా పండుగ వాతావరణం అలుముకుంది. జింగిల్ బెల్ పాటకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్‌రెడ్డి, కోఆర్డినేటర్లు జయశ్రీ, రోజారాణి, ఇంచార్జిలు అనగమత, పిఇటి కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.