సీపీఎం మద్దతుతో గెలుస్తున్నాం: మంత్రి శ్రీధర్‌బాబు
సీపీఎం మద్దతుతో పెద్దపార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ గెలబోతున్నారని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బు ధీమా వ్యక్తం చేశారు. మంథని పట్టణంలో గురువారం సీపీఎం నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. కార్యకర్తలంతా సమన్వయం తో పనిచేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని గద్దె దించాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో నాయకులు ఎర్రవెల్లి ముత్యంరావు, మహేశ్వరి, వేల్పుల కుమార్‌స్వామి, బూడిద గణేష్, ఆర్ల సందీప్, వేల్పుల సురేష్, గొర్రెంకల సురేష్, ప్రసాద్ పాల్గొన్నారు.




