31 March, 2026 | 12:29 PM

బీఆర్‌ఎస్, బీజేపీ తోడు దొంగలు

03-05-2024 01:47 AM

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, మే 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ తోడు దొంగలని, పదేళ్ల పాలన లో రెండు ప్రభుత్వాలు ప్రజల కోసం ఏమీ చేయలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో గురువారం ఆయన ఎంపీ అభ్య ర్థి రామసహాయం రఘురాంరెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ల పేరుతో రూ.కోట్ల కమిషన్లు దోచుకున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ద్వారా కృష్ణా జలా లను ఆంధ్రాకు తరలించి, తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టారని నిప్పులు చెరిగారు.

బస్సుయాత్ర పేరుతో ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ ప్రభు త్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటును పూర్తిగా విస్మరించిందన్నారు. కేసీఆర్ ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిస్తే, కేంద్రంలో మంత్రిని చేస్తానని ప్రకటించారని, ఆ ప్రకటన వెనుక అర్థమేమిటో ప్రజలు ఆలోచించాలని సూచించారు. కాం గ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల మంగళసూత్రాలను ముస్లింలకు ఇస్తుందని బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘు రాంరెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సహాయ సహకారాలతో తాను ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.  ప్రచారంలో జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్,  మాజీ ఎమ్మెల్సీ బాల సాని లక్ష్మీనారాయణ, నాయకులు పాల్గొన్నారు.