11 May, 2026 | 1:00 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

హైదరాబాద్ అంటేనే... బిజినెస్ అనే బ్రాండ్: మంత్రి శ్రీధర్ బాబు

28-01-2025 05:37 PM

హైదరాబాద్: వ్యాపార వర్గాలు ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాయని, గతేడాది పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(IT Minister Duddilla Sridhar Babu) చెప్పారు. ఇది స్థిరమైన  ప్రభుత్వమని, వ్యాపారాలు విశ్వాసించారని, 2024 దావోస్(Davos) పర్యటన కంటే ఈసారి 4 రెట్లు అధికంగా ఒప్పాందాలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్ అంటేనే... బిజినెస్ అనే బ్రాండ్ ఏర్పడిందని, అధునాతన సాంకేతిక నైపుణ్యాల(Advanced technical skills)కు హైదరాబాద్ ను కేంద్రంగా మారుస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. మూసి నదిని ప్రక్షాళన చేసి నగర ప్రజలకు స్వచ్చమైన గాలి అందిస్తామని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేలా స్కిల్ యూనివర్శిటీ(Skill University) తయారుచేస్తామని మంత్రి అన్నారు. పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను నైపుణ్య కల్పనకు కూడా ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

రూ.450 కోట్లతో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు క్యాపిటలాండ్ ఒప్పందం(CapitaLand Agreement) జరిగిందని అన్నారు. దావోస్ ఒప్పందాల పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 49,500 ఉద్యోగాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. స్విట్జర్లాండ్ కు చెందిన యూబీఎస్(UBS), మల్టీవాక్ గ్రూప్ (Multivac Group) లతో భారీ ఒప్పందాలు, స్విట్జర్లాండ్ కు చెందిన రెండు సంస్థల పెట్టుబడులే రూ. 49 వేల కోట్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణకు ఇతర రాష్ట్రలతో పోటీ కాదని, అభివృద్ది చెందిన దేశాలతో తెలంగాణ పోటీ పడాలనేది సీఎం ఆకాంక్ష అని కొనియడారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థికవ్యవస్థగా మారుస్తామని, వన్ ట్రిలియన్ డాలర్ కు ఎదిగినప్పుడే మేము విజయం సాధించినట్లు అని శ్రీధర్ బాబు అన్నారు.