11 August, 2026 | 2:51 PM

Breaking News

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

11-08-2026 02:06 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారికి సమర్పించే బోనాలను ప్రత్యేకంగా అలంకరించి, విద్యార్థినులు తలపై బోనాలను ఎత్తుకొని పాఠశాల ప్రాంగణంలో సందడి చేశారు. బోనాల్లో వేప ఆకులు, పూలు, పసుపు, కుంకుమతో అందంగా అలంకరించడంతో పాఠశాల ఆవరణ పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు, విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకుని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించు కున్నారు.తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ నృత్యాలు, పాటలతో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొంతం వెంకటేశం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.