calender_icon.png 18 May, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబును బర్తరఫ్ చేయాలి..

17-05-2025 08:18:01 PM

మాల సంఘం జిల్లా అధ్యక్షుడు..

బోథ్ (విజయక్రాంతి): ఇటీవల ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం ఆ జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అహంకారానికి నిదర్శనమని మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. శనివారం బోథ్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీని ఆహ్వానించకపోవడం అంటే మొత్తం మాల సమాజాన్ని కించపరచినట్టేనని అన్నారు.

వెంటనే శ్రీధర్ బాబును మంత్రివర్గము నుండి బర్తరఫ్ చేయాలని, అలాగే ప్రోటోకాల్ పాటించని సంబంధిత దేవదాయ శాఖ కమిషనర్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మల్లన్న, కార్యదర్శి రాజేశ్వర్, బోథ్ మండల అధ్యక్షుడు ఎలుక రాజు, దేవన్న, రాఘవేంద్ర, లక్ష్మణ్, ఉషన్న, తదితరులు పాల్గొన్నారు.