17-05-2025 08:20:21 PM
బోథ్ (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న పశువుల కంటైనర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఘన్పూర్ వద్ద పట్టుబడింది. శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న ఆవులు, కంకలు ఉండడం వల్ల పట్టుకున్నామని బోథ్ సీఐవెంకటేశ్వర రావు, ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏటువంటి అనుమతులు లేకుండా గ్వాలియర్ నుండి హైదరాబాద్ వెళుతున్న కంటైనర్ లో 30 కంకలు, నాలుగు మగ దూడలు, మూడు ఆవులు ఉన్నాయని అన్నారు. కంటైనర్ లో తెచ్చిన పశువులను ఇచ్చోడ గోషాల కు తరలించామని, కంటైనర్ ను బోథ్ పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.