15 May, 2026 | 1:06 PM

కంది ఐఐటీ సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

26-08-2024 03:01 PM

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లాలో సోమవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కంది ఐఐటీని మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత కారును మంత్రి పరిశీలించారు. మంత్రి శ్రీధర్ బాబు వెంట మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డ్రైవర్ రహిత వాహనంలో శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఐఐటీ డైరెక్టర్ ప్రయాణించారు. ఐఐటీ క్యాంపస్ లో టెక్నాలజీ గురించి మంత్రి శ్రీధర్ బాబు అడిగి తెలుసుకున్నారు.