15 May, 2026 | 2:07 PM

కవితకు బెయిల్ ఖాయమా..? ఢిల్లీ బయల్దేరిన కేటీఆర్, హరీశ్

26-08-2024 02:39 PM

న్యూఢిల్లీ:  బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ రెండు కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టు 12న సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది. అయితే, రేపు కవిత జైలు నుంచి విడుదల అవుతున్నారంటూ సామాజిక మాద్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ, బీఆర్ఎస్ నేతలందరూ ఢిల్లీకి వెళ్తడం, ఇవన్నీ చూస్తుంటే కవితకు ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రేపు మధ్యాహ్నం వరకు స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండు సార్లు తీహార్ జైల్లో అస్వస్థకు గురైన ముచ్చట తెలిసిందే.