మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్‌పై మంత్రి తుమ్మల సమీక్ష
కరీంనగర్, మార్చి 29 (విజయ క్రాంతి): మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మె్ంప కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారంఅసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తికి తీ సుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలో మానేరు రివర్స్ ఫ్రంట్ పై మంత్రుల క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లు తెలిపారు.
భూ సేకర ణ, అంచనా వ్యయం, నీటిపారుదల, పర్యాటక శాఖ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




