రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూన్ 10 (విజయక్రాంతి): రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి త్రివేణి ఫంక్షన్ హాల్ వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, పౌరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం త్రివేణి ఫంక్షన్ హాల్ లో పౌరులకు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడి సహాయసహకారాలు అందిస్తే రహవీర్ గా గుర్తింపు వస్తుందన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రోడ్డు భద్రత అంటే రోడ్డు పై ప్రయాణం చేసే ప్రజలు, వాహనదారులు సురక్షితంగా గమ్యం చేరడం అన్నారు. ప్రతి సంవత్సరంకాలంలో తెలంగాణ వ్యాప్తంగా 7,500 కు పైగా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు, మన జిల్లాలో సగటున సంవత్సరానికి 250 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు.
అధిక ప్రమాదాలు నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లనే సంభవిస్తున్నాయన్నారు, తప్పుడు మార్గంలో వాహనాలు నడపడం, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, పిల్లలు వాహనాలు నడపడం, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు వీటిని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు జాగ్రతగా అవగాహనలో వాహనాలు నడపాలన్నారు.
తదుపరి ఆశా కార్యకర్తలకు హెల్మెట్ అందించి, రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎంవిఐ ఆదిత్య, సూర్యాపేట పట్టణ, రూరల్ సిఐ లు రాజశేఖర్, వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్టీసీ ఇన్స్పెక్టర్ సైదులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, జానయ్య, పట్టణ ఫైర్ స్టేషన్ అధికారి జానయ్య, అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి సతీష్, ఎస్‌ఐ లు ఏడుకొండలు, మహేందర్ నాథ్, సాయిరాం ఆర్‌ఎస్‌ఐ లు అశోక్, రాజశేఖర్, అన్వర్, షి టీమ్ సిబ్బంది, టెక్నికల్ టీం సిబ్బంది, రోడ్డు సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.






